Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంలో కొనసాగనున్న వాదనలు
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతను ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. బుధ, గురువారాల్లో కూడా ఈ వాదనలు కొనసాగనున్నాయి. కేంద్రప్రభుత్వం వచ్చే వారం తన వాదనలు వినిపించనుంది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోV్ాతగి మాట్లాడుతూ, ఒక కమ్యూనిటీ ప్రాధమిక హక్కులను తిరస్కరించడానికి ప్రజామోదాన్ని పరీక్షించడం సరిపోదని వ్యాఖ్యానించారు. ''అసలు ఇక్కడ జరుగుతున్న కళంకం ఏమిటి? రాజ్యాంగ ప్రకటన ద్వారా మాత్రమే దాన్ని తొలగించగలుగుతాం.'' అని అన్నారు. ''లైంగిక దృక్పథం ప్రాతిపదికగా వివక్ష చూపడమనేది ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తుంది.'' అని వ్యాఖ్యానించారు. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ, ప్రత్యేక వివాహాల చట్టం కింద వివాహం చేసుకోవాలనుకుంటున్న జంట తప్పనిసరిగా 30 రోజుల నోటీసు ఇవ్వాలనడం కూడా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ''సాధారణ వివాహంలో కూడా ఆ వివాహానికి అభ్యంతరం వున్న వారు వెంటనే వాటిని తెలియచేయాంటూ నోటీసులివ్వాలనడం కూడా రాజ్యాంగ విరుద్ధం.'' అని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ పిటిషన్ల విచారణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం ప్రకటించింది. అందుకు అనుగుణంగా జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ పిఎస్ నరసింహాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణను ప్రారంభించింది. బయోలాజికల్ పురుషుడు లేదా బయోలాజికల్ మహిళ అన్న భావన సంపూర్ణం కాదు, మీ జననాంగాలు ఏమిటనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న కాదు'' అని విచారణ సందర్భంగా విడిగా చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఏ సంబంధమైనా సామాజికంగా ఆమోదం పొందడమనేది కేవలం న్యాయ స్థానాలపైనో లేదా చట్టసభలపైనో ఎన్నడూ ఆధారపడి వుండదని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ చంద్రచూడ్ పై వ్యాఖ్యలు చేశారు.