Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 184 పాయింట్లు కోల్పోయి 59,727కు పడిపోయింది. అదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 47 పాయింట్లు తగ్గి 17,660 వద్ద ముగిసింది. ఉదయం నుంచి మార్కెట్లకు ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. విద్యుత్, టెలికాం రంగ షేర్లు ఎక్కువ ప్రతికూలతను ఎదుర్కోవడంతో పాటు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. బిఎస్ఇలో మిడ్ క్యాప్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.2 శాతం చొప్పున పెరిగాయి. బిఎస్ఇలో వైద్య రంగం, రియాల్టీ సూచీలు ఒక్క శాతం చొప్పున రాణించాయి.