Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో బరితెగించిన కామాంధ నిందితులు
- మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు, చెల్లి
ఉన్నావో : గతేడాది లైంగికదాడికి గురైన మైనర్ దళిత బాలిక ఇంటికి కొంతమంది దుండగులు సోమవారం నిప్పంటించారు. దీంతో ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా వుంది. ఈ చిన్నారుల్లో ఒకరు బాధిత మహిళ ఆరు మాసాల బిడ్డ కాగా మరొకరు రెండు మాసాల వయస్సున్న చెల్లి. గతేడాదిలైంగిక దాడి ఫలితంగా 11ఏండ్ల బాలిక గర్భవతై బిడ్డను కందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులిద్దరూ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. నిందితులిద్దరూ మరో ఐదుగురితో కలిసి సోమవారం సాయంత్రం బాధితురాలి పూరిపాకలోకి బలవంతంగా ప్రవేశించారని, కేసు ఉపసంహరించుకోవడానికి బాధితురాలు తిరస్కరించడంతో ఇంటికి నిప్పంటించినట్లు తెలుస్తోంది. బాధితురాలి తల్లిని తీవ్రంగా కొట్టి, అనంతరం ఇంటికి నిప్పంటించి పారిపోయారు. బాధితురాలి కొడుక్కి 35శాతం మేరా కాలిందని, సోదరికి 45శాతం మేరా కాలిందని చీఫ్ మెడికల్ సూపరింటెడెంట్ సుశీల్ శ్రీవాస్తవ తెలిపారు. వారి పరిస్థితి క్షీణిస్తుండడంతో మరింత మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌కు పంపినట్లు చెప్పారు. నిందితుల పక్షానికి మారిపోయిన బాధితురాలి తండ్రిపై బాధితురాలి తాతా, మేనమామలు గొడ్డలితో దాడి చేశారని పూర్వ సర్కిల్ అధికారి సంతోష్ సింగ్ తెలిపారు. ఈ నెల 13న జరిగిన ఈ ఘటనపై ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో ఆమె తండ్రిని చేర్చారని తెలిపారు. 2022 ఫిబ్రవరి 13న దళిత బాలిపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఆ ఏడాది సెప్టెంబరు పిల్లాడికి జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు.