Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు పోలీసులపై వేటు
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపి అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకోకుండా నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ నలుగురు పోలీసులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.షాహగంజ్ పోలీస్ సీనియర్ అధికారి అశ్వని కుమార్ సింగ్‌తోపాటు ఓ ఇన్స్పెక్టర్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుకు సంబంధించి పోలీసులను ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించింది. ఈ పోలీసులు షాహగంజ్ పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే హత్య జరిగిన మెడికల్ కాలేజీ ప్రాంతం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది.