Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సిటీలకు యూజీసీ ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో అయినా సరే విద్యార్థులు కోరుకుంటే స్థానిక భాషల్లో పరీక్షలు రాయడానికి వారిని అనుమతించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ ) ఉత్తర్వులు జారీ చేసింది. యుజిసి చైర్మన్ జగదీష్ కుమార్ బుధవారం వెల్లడించారు. పాఠ్య పుస్తకాలను రూపొందించడంలోనూ, మాతృభాష/ స్థానిక భాషల్లో బోధన-అభ్యాస ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని యూజీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మాతృభాష/స్థానిక భాషల్లో పాఠ్య పుస్తకాలను రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను అనువదించడంతో సహా బోధనల్లో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు అవసరం' అని యుజిసి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాబట్టి, మీ విశ్వ విద్యాలయంలో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో కోర్సులు అందించినప్పటికీ, పరీక్షల్లో స్థానిక భాషల్లో సమాధానాలు రాయడానికి అనుమతించాలని, స్థానిక భాషల్లో అనువాదాన్ని ప్రోత్సహించాలని, విశ్వ విద్యాలయాల ప్రక్రియలో బోధన-అభ్యాసంలో స్థానిక భాషను ఉపయోగించాలని యూజీసీ విజ్ఞప్తి చేసింది.