Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నరోడా గామ్ కేసులో బీజేపీ నాయకురాలు మాయా కొడ్నానీ, బజరంగ్దళ్ నాయకుడు బాబూ బజరంగి సహా 60 మంది నిందితులకు క్లీన్చిట్ ఇస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. నరోడా గామ్‌లో మతోన్మాదులు గృహదహనాలకు పాల్పడడంతో 11 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2017లో కోర్టుకు హాజరయ్యారు. 2002లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కొడ్నానీ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో మతహింస చెలరేగింది. ఆమెకు నరోడా పటియా అల్లర్ల కేసులో న్యాయస్థానం 28 సంవత్సరాలు జైలుశిక్ష విధించగా ఇప్పుడు గుజరాత్ హైకోర్ట్ నిర్దోషిగా విడిచి పెట్టింది.