Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్ముకాశ్మీర్లో ప్రమాదం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఫూంచ్ - జమ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు సజీవదహనమ య్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలధాటికి ట్రక్కు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. పిడుగుపాటు కారణంగా వాహనంలో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్కు ఇలాంటి ప్రమాదమే జరిగింది. రాజస్థాన్లోని ఉదరుపూర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ వెహికిల్లో టెక్నికల్ ఫెయిల్యూర్ తలెత్తింది. ఉదరుపూర్లోని మిలిటరీ స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం తలెత్తింది. అంతకు ముందు 2021లో ఆర్మీ వెహికిల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.