Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన ఒక యూట్యూబర్ పై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ)ను విధించిడంపై తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతనిపై ఎన్ఎస్ఏను ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించింది. వలస కార్మికులపై దాడులకు సంబంధించి నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడంపై బీహార్ యూట్యూబర్ మనీశ్ కశ్యప్ అరెస్టయ్యాడు. గత నెలలో వలసకార్మికులు, ప్రత్యేకించి బీహార్ నుంచి వచ్చిన వారిపై తమిళ నాడులో దాడులు జరుగుతున్నాయనీ, వారు చంప బడుతున్నారని పేర్కొంటూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఈ ఆరోపణలన్నీ నకిలీవని తమిళనాడు పోలీసులు, రాష్ట్ర అధికారులు, ఫ్యాక్ట్ చెకర్లు తెలిపారు. దీంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంపై కశ్యప్, యూపీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్, ఒక హిందీ న్యూస్ పేపర్, బీజేపీ అనుకూల వెబ్సైట్ ఎడిటర్ నుపుర్ శర్మ, దాని సీఈఓ రాహుల్ రోషన్‌లపై తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈనెల 6న కశ్యప్‌ను ఎన్ఎస్ఏ కింద అదు పులోకి తీసుకున్నారు. ఎన్ఎస్ఏ కింద ఎలాంటి విచారణ లేకుండా ఏడాది పాటు అదుపులో ఉండటా నికి అనుమతినిస్తుంది. అయితే, ఒక యూట్యూబర్ పై అత్యంత కఠినమైన నిర్బంధ చట్టం ఎన్ఎస్ఏను ప్రయోగించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మనిషి (కశ్యప్)పై ఈ ప్రతీకారం ఎందు కు? అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీహార్ నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయన్న తప్పుడు వీడి యోలను కశ్యప్ రూపొందిస్తున్నాడని తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేటు కపిల్ సిబల్ తన వాదనలను వినిపించారు. కశ్యప్‌ను ప్రస్తుత మున్న మదురై కేంద్ర కారాగారం నుంచి తరలించొ ద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది. ఎన్ఎస్ఏ కింద నిర్బంధాన్ని సవాలు చేయడానికి పిటిషన్లో సవరణ కోసం కశ్యప్‌కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. సవరిం చిన పిటిషన్‌పై బీహార్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వా లకు న్యాయస్థానం నోటీసులు పంపింది. అయితే నుపుర్ శర్మ, రాహుల్ రోషన్ల పిటిషన్లను విచారిం చడానికి సుప్రీకోర్టు తిరస్కరించింది. బదులుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ను నుపుర్, రాహుల్ రోషన్లు తమ పిటిషన్లలో సవాలు చేశారు.