Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌర విద్యుత్ ఉత్పత్తే పరిష్కారమా..!
న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాలలో ఈ సంవత్సరం మార్చి నెలలోనే వేసవి తన ప్రతాపం చూపించింది. ఈ నెలలో అయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో విద్యుత్ సరఫరా పై ఒత్తిడి పెరిగింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ కారణం గా విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటోం ది. మరో వైపు రాత్రి సమయా లలో డిమా ండ్ కంటే సరఫరా 1.7 శాతం తక్కువగా ఉంది. రాత్రి సమయంలో గరిష్టంగా 217 గిగా వాట్ల (ఒక గిగా వాట్ అంటే బిలియన్ వాట్లు) విద్యుత్ డిమాండ్ ఉంటో ంది. ఇది గత సంవత్సరపు గరిష్ట డిమాండ్ కంటే 6.4 శాతం అధికం. ఈ దశలో సౌర విద్యుత్ ఉత్పత్తి పరిస్థితిని కొంత చక్కదిద్దే అవకాశం ఉంది. అయితే దానిని నిల్వ చేసే సామర్ధ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్నప్పటికీ అక్కడ విద్యుత్ సరఫరాకు పెద్దగా ఆటంకం కలగకపోవడానికి కారణం సమర్ధవంతమైన నిర్వహణే. సౌర విద్యుత్ లభ్యత, నిల్వ సామర్ధ్యం ఎక్కువ గా ఉంటే వినియోగ దారులు దాని వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. దీనివల్ల గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుంది. బ్లాకౌట్లను నివారించవచ్చు.
కొందరికే సౌర విద్యుత్..
సౌర విద్యుత్ వినియోగించే ఆర్థిక స్తోమత కొందరికే పరిమిత మవుతోంది. సామాన్య,మధ్య తరగతి జనం మాత్రం మా ఖర్మ ఇంతేలే అంటూ బతుకీడిస్తూ.. కరెంట్ ఉన్నప్పుడు ఫ్యాన్‌తో ఉక్క నుంచి ఊరట చెందామని భావించటం సర్వసాధారణం. ఇక ఆదాయపరంగా వెసులుబాటు ఉన్న ఇండ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి చోట్ల సౌర విద్యుత్ ను వినియోగించు కోనే అవకాశాలు ఎక్కువ.
పగటి వేళ అధికంగా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను బ్యాటరీలలో నిల్వ చేసి, దానిని రాత్రి సమయంలో ఉపయోగించుకోవచ్చు. సౌర విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసి, నిల్వ చేసినట్లయితే గ్రిడ్ విఫలమైనప్పటికీ దానిని ఉపయోగించుకోవచ్చు.
దీనివల్ల సరఫరా నష్టాన్ని తగ్గించవచ్చు. లోడ్‌ను పెంచి, స్థానిక విద్యుత్ నాణ్యతను నియంత్రించవచ్చు. దీనికితోడు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌తో అనుసంధానించవచ్చు. అయితే దీనంతటికీ కొంత సమయం పట్టే అవకాశం ఉంది.