Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో తన అధికార నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ బంగ్లాలో రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు. ఇటీవల రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ సిఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్సభ హౌసింగ్ కమిటీ.. ఈ నెల 22లోగా భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా రాహుల్ గాంధీకి లేఖ పంపిన సంగతి తెలిసిందే. దీంతో 12 తుగ్లక్ లేన్ బంగ్లాను రాహుల్ నేడు ఖాళీ చేశారు. మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. వాస్తవానికి పరువునష్టం కేసులో గుజరాత్ కోర్టు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు రాహుల్కు 30 రోజుల గడువు ఇచ్చింది. అయితే శుక్రవారం ఆయన సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించినా.. అక్కడ ఊరట లభించలేదు. సూరత్ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ.. ఇప్పుడు రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.