Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈటానగర్ : కొలీజియం వ్యవస్థ ఓ మైండ్ గేమ్ అంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరుణా చల్ప్రదేశ్లో 4జీ సేవల కోసం నిర్మించిన 254 మొబైల్ టవర్లను శనివారం కిరణ్‌రిజిజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలు సహా సుప్రీంకోర్టు కొలీజియం చేసిన పలు సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న విషయంపై మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొలీజియం వ్యవస్థ గురించి వ్యాఖ్యానించను అంటూ నే.. 'అదంతా ఓ మైండ్ గేమ్' అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తపిర్గావో లోక్‌సభకు కిరణ్ రిజిజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొలీజియం వ్యవస్థ అనే ది రాజ్యాంగంలోనే లేదంటూ గతంలోనూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.