Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టే ఉత్తర్వులు జారీ
పాట్నా : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. దిగువ కోర్టు సమన్లుపై హైకోర్టు సోమవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. మోడీ ఇంటిపేరుపై పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ వేసిన కేసులో ఎంపి, ఎంఎల్ఎ కోర్టు సమన్లు జారీ చేసింది. రాహుల్ స్టేట్మెంట్ను నమోదు చేయడానికి మంగళవారం రావాల్సిందిగా దిగువ కోర్టు ఆదేశించింది. వీటి అమలుపై పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే కేసులో సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన వారంరోజుల తర్వాత పాట్నా కోర్టు మార్చి 30న రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 12న రాహుల్ తమ ముందు హాజరు కావాలని ఎంపి, ఎంఎల్ఎ కోర్టు ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆది దేవ్ మార్చి 18న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వేరే విచారణా తేదీని నిర్దేశించాల్సిందిగా రాహుల్ తరపు న్యాయవాది కోరడంతో ఏప్రిల్ 25 తదుపరి విచారణా తేదీగా నిర్ధారించారు. తాజాగా ఈ ఆదేశాలు అమలుపై పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది.