Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్:నరోదా గమ్ అల్లర్ల కేసులోని 67మంది నిందితులందరినీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సుప్రీంకోర్టు నియమిత సిట్ గుజరాత్ హైకోర్టులో సవాలు చేయనుంది. గోద్రా అనంతర ఘర్షణల సమయంలో 2002లో అహ్మదాబాద్‌లోని నరోదా గమ్ ఏరియాలో ఊచ కోతలో 11మంది ముస్లింలు చనిపోయారు. ఈ కేసులో రెండు దశాబ్దాల తర్వాత ఏప్రిల్ 20న మొత్తంగా 67మంది నిందితులను విడిచిపెడుతూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.