Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, చైనా అంగీకారం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ (పశ్చిమ సెక్టార్)లో మిగిలివున్న సమస్యలకు సాధ్యమైనంత త్వరలో పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కా రాన్ని రూపొందించేందుకు, సన్నిహిత సంబంధాలు కలిగివుండేం దుకు భారత్, చైనా అంగీకరించాయి. ఆదివారం జరిగిన మిలటరీ చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు సోమవారం విదేశాంగ మంత్రి త్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమ సెక్టార్లో వాస్తవాధీన రేఖ పొడవునా సంబంధిత సమస్యల పరిష్కారంపై ఉభయ పక్షాలు అరమరిక లు లేకుండా, కూలంకషంగా చర్చలు జరిపాయని ఆ ప్రకటన పేర్కొంది.