Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కమ్ నష్టాలపై సీఎంలకు మాజీ ప్రభుత్వ కార్యదర్శి లేఖ
న్యూఢిల్లీ : డిస్కమ్ నష్టాలలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. విద్యుత్ పంపిణీ కంపెనీలకు (డిస్కమ్) వచ్చే నష్టాలలో యాభై శాతాన్ని వినియోగదారులే భరించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ ఇటీవల రాష్ట్రాలకు తాఖీదులు పంపింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ముసాయిదా విద్యుత్ సవరణ నిబంధనలను విడుదల చేసింది. 2005 నాటి విద్యుత్ నిబంధనల్లో రెండు ప్రత్యామ్నాయాలను సూచిం చింది. వీటిపై మే 11వ తేదీ లోగా అభిప్రాయాలు తెలియ జేయాలని రాష్ట్రాలను కోరింది. వీటి ప్రకారం డిస్కమ్ నష్టాలను పంపిణీ లైసెన్స్దా రుడు, వినియోగదారులు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ డిస్కమ్కు లాభాలు వస్తే మూడింట రెండో వంతును వినియోగదారులకు అందిస్తారు. మిగిలి నది పంపిణీ లైసెన్స్దారుకు చెందుతుంది. నష్టం వస్తే మాత్రం చెరి సగం భరించాలి. అయితే విద్యుత్ శాఖ ఏకపక్ష వైఖరి తీసుకుందని, రాష్ట్ర విద్యుత్ సంస్థలపై కేంద్రం విధించిన ఆంక్షల కారణంగానే డిస్కమ్కు నష్టాలు వస్తున్నాయన్న వాస్తవాన్ని అది విస్మరించిందని శర్మ ఆ లేఖలో వివరించారు.