Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ చట్ట సవరణలపై బాంబే హైకోర్టు
న్యూఢిల్లీ : ఐటీ చట్టంలో చేసిన సవరణలు అనుకరణ, వ్యంగ్య వార్తలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదని బాంబే హైకోర్ట్ అభిప్రాయపడింది. సవరణల రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ హాస్యనటుడు కునాల్ కమ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జీఎస్ పటేల్, జస్టిస్ నీలా గోఖలేతో కూడిన బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఆన్లైన్ గేమ్స్‌ను, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వార్తలను నియంత్రిస్తూ ఈ నెల 6న ఈ సవరణలు ప్రతిపాదించారు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారమైనా అవాస్తవమైనదని, తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని భావిస్తే.. వాటిని నియంత్రించడానికి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఈ సవరణ ఐటీ శాఖకు అధికారం కట్టబెట్టింది. అనుకరణ, వ్యంగ్య వార్తలను అడ్డుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను జస్టిస్ పటేల్ ప్రస్తావిస్తూ 'మీ నిబంధనలు అలా చెప్పడం లేదే' అని ప్రశ్నించారు. ఆ వార్తలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదని, ఆ విషయాన్ని తాము పరిశీలిస్తామని చెప్పారు. నిబంధన అవసరమైన రక్షణ చర్యలు లేవని తెలిపారు. కమ్రా పిటిషన్ రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించినదని చెప్పారు.