Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్..!
అహ్మదాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కోర్టును ఆశ్రయించారు. సూరత్ సెషన్స్ కోర్టు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించడంతో తాజాగా గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ట్రయల్ కోర్టు రాహుల్‌గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల సమయంతో ఇవ్వడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా రాహుల్ గాంధీ తొలుత సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రెండేండ్ల జైలు శిక్షను నిలుపుదల చేయడంతో పాటు తనను దోషిగా పేర్కొన్న తీర్పును నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లను వేశారు. ఈ క్రమంలో సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న స్టే విధించేందుకు నిరాకరిస్తూ తీర్పును వెల్లడించింది. దీంతో రాహుల్ గాంధీ ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.