Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ప్రధాని మోడీ
తిరువనంతపురం : కేరళ మొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉదయం 11.10గంటలకు ఈ రైలు బయలుదేరింది. సెమీ హై స్పీడ్, పూర్తి ఎయిర్ కండీషన్డ్ సర్వీస్ అయిన ఈ రైలు 11 జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. దక్షిణాన తిరువనంతపురం నుంచి ఉత్తరాన గల కాసర్గోడ్ను ఈ రైలు కలుపుతుంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చజెండాను ప్రధానికి అందచేయగా, ఆయన దాన్ని ఊపగానే రైలు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీ శశి థరూర్లు పాల్గొన్నారు. కోచి నుండి నేరుగా తిరువనంతపురం చేరుకున్న మోడీ అక్కడ నుండి సరాసరి సెంట్రల్ రైల్వే స్టేషన్కు వచ్చారు. స్టేషన్కి రాగానే మోడీ వందేభారత్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళి అక్కడ గల పాఠశాల విద్యార్ధులతో కాసేపు మాట్లాడారు. ఈ వందేభారత్ రైలు 14 రైల్వే స్టేషన్లలో ఆగనుది. 26న కాసర్గోడ్ నుండి తిరువనంతపురానికి, 28న తిరువనంతపురం నుంచి కాసర్గోడ్కు ఈ రైలు తిరగనుంది. గురువారాలు మినహా అన్ని వారాల్లో ఈ రైలు సర్వీసులు వుంటాయి. ఆదివారం ఉదయం నుంచి బుకింగ్స్ ఆరంభమయ్యాయి.