Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో పరిస్థితి ఆందోళనకరం
- వివక్షాపూరిత విధానాలు, చట్టాలు
- మైనారిటీల గొంతు నొక్కుతున్నారు
- అమెరికా స్వతంత్ర సంస్థ నివేదిక
భారత్‌లో మతస్వేచ్ఛను పాలకులు కాలరాస్తున్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ అభిప్రాయపడింది. మత స్వేచ్ఛ విషయంలో భారత్‌లో నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆ సంస్థ 'యునైటెడ్ స్టేట్స్ ప్యానెల్' తెలిపింది. ఈ మేరకు భారత్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ శ్వేతసౌధానికి సిఫార్సు చేసింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర సంస్థ నివేదికను రూపొందించింది. ఈ సంస్థ వివిధ దేశాలలో మత స్వేచ్ఛ హక్కు ఎలా పరిరక్షించబడుతున్నదో పరిశీలిస్తుంది.
న్యూఢిల్లీ : . భారత్‌లో మత స్వేచ్ఛ తీవ్ర అణచివేతకు గురవుతోందని యునైటెడ్ స్టేట్స్ ప్యానెల్ తాజా అధ్యయనం చెబుతున్నది. ఈ విషయంలో భారత్‌పై ఆ సంస్థ వరుసగా నాలుగు సంవత్సరాలుగా ఇదే రకమైన సిఫార్సులు చేస్తోంది. ఈ సంస్థ నివేదికను భారత ప్రభుత్వం గత సంవత్సరం తోసిపుచ్చింది. ఇది పక్షపాతపూరితంగా, అసమగ్రంగా ఉన్నదని వ్యాఖ్యానించింది.
మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘిస్తున్న భారత ప్రభుత్వ సంస్థలు, అధికారులపై ఆంక్షలు విధించాలని, వారి ఆస్తులను స్తంభింపజేసి, వారిని అమెరికాలో ప్రవేశించకుండా నిషేధించాలని స్వతంత్ర సంస్థ తన నివేదికలో సూచించింది. 2022లో భారత్‌లో మత స్వేచ్ఛకు సంబంధించి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వం అన్ని స్థాయిలలోనూ మతపరంగా వివక్షాపూరితమైన విధానాలు, చట్టాలు అమలు చేస్తోందని తెలిపింది. మత మార్పిడులు, మత విశ్వాసాల మధ్య సంబంధాలు, హిజాబ్, గోవధ వంటి ఉదంతాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇవి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితులు, ఆదివాసీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో అణగారిన వర్గాలు... ముఖ్యంగా మైనారిటీల గొంతు నొక్కుతోందని నివేదిక తెలిపింది. వారి కదలికలపై నిఘా వేయడం, వేధింపులకు పాల్పడడం, ఆస్తులు ధ్వంసం చేయడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.
'మత స్వేచ్చనుÛ, భావ ప్రకటనా స్వేచ్ఛను లక్ష్యంగా చేసుకొని మోడీ ప్రభుత్వం ఉపా, రాజద్రోహ చట్టాన్ని ప్రయోగిస్తోంది. ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. పలువురు పాత్రికేయు లు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, మత స్వేచ్ఛను కోరుకునే మైనారిటీలపై నిఘా వేయడం, వేధించడం, నిర్బంధించడం, విచారించడం వంటి చర్యలకు దిగుతోంది. మతోన్మాదులు గో రక్షకుల పేరిట హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీల ఇళ్లను కూలగొడుతున్నారు. క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి. మైనారిటీలకు వ్యతిరేకం గా సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ హింస ను ప్రేరేపిస్తున్నారు. ముస్లింలను అతి దారుణంగా హతమారుస్తున్నట్లు చూపిన ఓ కారికేచర్‌ను బీజేపీ గుజరాత్ కమిటీ ట్విటర్లో షేర్ చేసింది. దీనిని ఫిబ్రవరిలో ట్విటర్ తొలగించింది' అని ఆ నివేదిక తెలిపింది. భారత్ సహా మొత్తం 17 దేశాలు మత స్వేచ్ఛను కాలరాస్తున్నాయని అమెరికా సంస్థ ప్రస్తా వించింది. అయితే ఈ నివేదిక పరిపూర్ణం కాదని అమెరికా విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ సంస్థను సంప్రదించ వచ్చునని తెలిపారు. నివేదికను ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ స్వాగతించింది.