Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నాయకుల ఉదాశీనత
- కనీస సౌకర్యాలు లభించక ఇబ్బందులు
బెంగళూరు : ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కర్ణాటకకు వలస వచ్చిన వారి సంఖ్య లక్షలలోనే ఉన్నప్పటికీ వారి ఓటింగ్ హక్కుల గురించి పట్టించుకున్న వారే లేరు. వీరికి ఈ రాష్ట్రంలో కానీ, సొంత రాష్ట్రంలో కానీ ఓటు హక్కు లేదు. ఫలితంగా వీరికి కనీస సౌకర్యాలు కల్పించా ల్సిన అవసరాన్ని ఎవరూ గుర్తించడం లేదు. కర్నాటకలో 65.45 లక్షల మంది వలసవాదులు జీవిస్తున్నారు. వీరికి తాగునీరు, గూడు, పారిశుధ్యం, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు అందుబాటులో లేవు. 'ఎన్నికలు రాగానే వివిధ పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం మా వద్దకు వస్తారు. రేషన్ కార్డులు ఇస్తా మంటారు. ప్రభుత్వ పథకాలు కల్పిస్తామంటారు. అయితే వాస్తవానికి మాకు ఏ సాయమూ అందడం లేదు' అని కొల్కతా నుంచి వలస వచ్చిన 36 సంవ త్సరాల ప్రియాంక వాపోయారు. ఆమె నగరంలో ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో నివసించే ఇతర వలస కార్మికులు కూడా కనీస సౌకర్యాలను డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది వలసవాదులు తమ సొంత రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలని కోరుకుం టున్నారు. బొమ్మనహళ్లిలో ఉంటున్న బాబు అనే కార్మికుడు 'మా కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి. సొంత రాష్ట్రంలోనే ఓటు హక్కును అట్టిపెట్టుకోవడం వల్ల మాకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి' అని చెప్పారు. అయితే కర్ణాటకలో ఓటు హక్కు లేక పోవడంతో వీరికి ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో రాజకీయ నాయకులు ఉదాశీనత ప్రద ర్శిస్తున్నారు. బెంగళూరు నగరంలో ప్రధాన సమస్య అందుబాటు ధరలో గృహవసతి. ఇంటి అద్దెలు అధికంగా ఉండడం తో వాటిని కట్టలేక తరచూ ఇల్లు మారాల్సి వస్తోందని ప్రియాంక చెప్పారు. దీనివల్ల పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని అన్నా రు. పైగా విద్యా సంస్థలలో ప్రవేశం దొరకడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఇది ప్రియాంక ఒక్కరి సమస్య మాత్రమే కాదు. బెంగళూరు మహానగరంలో నివసిస్తున్న పలువురు వలసవాదులది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రా లు పొందడం కూడా చాలా దుర్లభమని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు కార్డు పొందేందుకు ఆమెకు రెండేండ్ల సమయం పట్టింది. అయితే జాబితా నుంచి ఆమె పేరును చాలాసార్లు తొలగిం చారు. తన పేరును తిరిగి చేర్చేందుకు ప్రియాంక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. సొంత రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి మరోలా ఉంది. ఓటు వేసేందుకు వెళ్లాలంటే యజమాని సెలవు ఇవ్వడం లేదు. ఫలితంగా స్వ రాష్ట్రంలోనూ వారి ఓట్లు తొలగిస్తున్నారు. వార్డులు, గ్రామ పంచాయతీలలో స్థానికత సమాచారం అందుబాటులో లేకపోవడంతో వలసవాదులు ఓటు హక్కు పొందలేకపోతున్నారు. రాష్ట్రంలో ఆరు నెలల పాటు నివసిస్తూ, ఇక్కడే ఉండాలనుకునే వారికి చట్టబద్ధంగా ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని మజ్దూర్ సంయోగి కేంద్రం సభ్యురాలు రోసీ అంటు న్నారు. అలా కాకుంటే వారిని అక్రమంగా నివస ిస్తున్న వారిగా పరిగణిస్తారని, అధికారుల వేధింపులు తప్పవని ఆమె చెప్పారు.