Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక హామీ
బెంగళూరు : కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే హిందూత్వ సంస్థ బజరంగ్దళ్, ముస్లిం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్ని కల ప్రణాళికను విడుదల చేసింది. ఈ రెండు సంస్థలు శతృత్వాన్ని పెంచు తున్నాయని, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయని విమర్శించింది. చట్టం, రాజ్యాంగం పవిత్రమైనవని, వాటిని వ్యక్తులు, సంస్థలు ఉల్లంఘించ డాన్ని సహించరాదని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక తెలిపింది. తమకు అధికారం అప్పగిస్తే బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమ, ప్రజా వ్యతిరేక చట్టాలను సంవత్సరం లోగా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే గృహయోజన, గృహలక్ష్మి, అన్నభాగ్య, యువనిధి, శక్తి పేరిట ఐదు పథకాలను కూడా ప్రకటించింది. కులగణన నివేదికను విడుదల చేస్తామని, ప్రస్తుతం 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 75 శాతానికి పెంచు తామని చెప్పింది. లింగాయతులు, ఒక్కలిగుల రిజర్వేషన్ కోటాను కూడా పెంచుతామని, అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లు పెంచుతామని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే.