Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవా సీఎం సావంత్
పనాజి : రాష్ట్రంలో జరుగుతున్న 90 శాతం నేరాలకు వలస కార్మికులే కారణమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. మేడే సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ప్రతి వలస కార్మికుడు గుర్తింపు కార్డును కలిగి ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడిన తర్వాత వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని, దీంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోందని అన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు గోవాలో నేరాలకు తెగబడుతున్నారని తెలిపారు. కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడం ద్వారా నేరాలను నిరోధించవచ్చునని ఆయన చెప్పారు. విదేశీయులపై దాడులు చేస్తున్నారన్న కారణంగా వలస కార్మికులను అరెస్ట్ చేస్తున్న ఉదంతాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి.