Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలక్కాడ్ : తరితలకి చెందిన సీనియర్ సిపిఎం నేత, అలతూర్ మాజీ ఎంఎల్ఎ ఎం.చంద్రన్ సోమవారం సాయంత్రం కోచిలో ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రస్తుతం సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న చంద్రన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా కూడా వున్నారు. పాలక్కాడ్ జిల్లా కార్యదర్శిగా మూడుసార్లు చేశారు. కాన్పూర్ గ్రామ పంచాయితీ అధ్యక్షుడిగా, కుమరనల్లూర్ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
తరితలలో పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి రాజేష్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. 2006 నుండి 2016 వరకు పదేళ్ళ పాటు అసెంబ్లీలో అలతూర్ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. ఎమర్జన్సీ సమయంలో నెల రోజులు జైలు శిక్ష అనుభవించారు. 1987లో జిరల్లా కార్యదర్శి కావడానికి ముందు పార్టీ లోకల్, ఏరియా, తాలుకా కమిటీల కార్యదర్శిగా కూడా పనిచేశారు. జిల్లా కార్యదర్శిగా మూడుసార్లు పనిచేశారు. చంద్రన్ మృతికి ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.గోవిందన్, మంత్రి ఎం.బి.రాజేష్‌లతో పాటూ పలువురు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.