Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులోని 11మంది దోషులను గతేడాది నిర్దోషులుగా విడిచిపెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను మే 9వ తేదీకి సుప్రీం వాయిదా వేసింది. దోషులకు శిక్ష తగ్గింపునకు సంబంధించి ఒరిజినల్ రికార్డులను ఇవ్వాల్సిందిగా మార్చి 27న కోర్టు జారీ చేసిన ఆదేశాలను సమీక్షించడానికి ఎలాంటి పిటిషన్ వేయలేదని, కేంద్రం, గుజరాత్ తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం బెంచ్‌కు తెలిపారు. బిల్కిస్ బానో కాకుండా ఇతరులు దీనిపై పిటిషన్లు దాఖలు చేయడానికి సంబంధించి ప్రారంభంలో సొలిసిటర్ జనరల్ ప్రాధమిక అభ్యంతరాలు లేవనెత్తారు. క్రిమినల్ కేసుల్లో ప్రతీసారీ ఇలా థర్డ్ పార్టీలు కోర్టుకు వస్తే తీవ్ర పర్యవసానాలు వుంటాయని అన్నారు. బానో వేసిన పిటిషన్‌కు సమాధానాలు ఇవ్వడానికి తమకు సమయం కావాలంటూ దోషుల తరపున న్యాయవాదులు కోరడంతో దీనిపై విచారణను బెంచ్ 9వ తేదీకి వాయిదా వేసింది.