Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక లోకానికి తరిగామి పిలుపు
శ్రీనగర్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు శ్రీనగర్‌లోని ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ నిర్వ హించింది. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ర్యాలీనుద్దే శించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసుఫ్ తరిగామి మాట్లాడారు. తమ హక్కుల సాధన, పరిరక్షణ కోసం నిరంతరంగా పోరు బాటలో పయనించే కార్మికులకు విప్లవ అభినందనలు తెలియచేశారు. కార్మిక వర్గం ఇన్నేళ్ళుగా సాధించిన వాటిని పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత పాలక పక్షం ప్రయ త్నిస్తోందని తరిగామి విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి బదులుగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం అను సరించే విధానాలతో సామాన్యుల జీవనోపాధులు దెబ్బతింటున్నాయన్నారు. సవాలుకరంగా పరిణమిస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో తమ హక్కుల పరిరక్షణ కోసం, జాతీయాస్తులను రక్షించుకోవడం కోసం కార్మిక వర్గంలో విస్తృత ఐక్యత అవసరమని అన్నారు. సిఐటియు నేత మహ్మద్ అఫ్జల్ పారీ మాట్లాడుతూ, పెన్షన్, పిఎఫ్, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను దశాబ్దాలుగా పోరాటం సాగించి సాధించుకున్నామని అన్నారు.