Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఐఎఫ్ఎఫ్ ముసాయిదా రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యత
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ముసాయిదా రాజ్యాంగాన్ని ఖరారు చేసే బాధ్యత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు అప్పగించింది. జులై 31కల్లా రాజ్యాంగ ముసాయిదా ఖరారు చేసి, నివేదిక రూపొందించే కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఏఐఎఫ్ఎఫ్ ఆఫీస్ బేరర్ల ఎన్నికలు జాతీయ క్రీడా కోడ్ను ఉల్లంఘించాయంటూ క్రీడాకారుడు, న్యాయవాది రాహుల్ మెహ్రా దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇండియన్ ఒలింపిక్ అసో సియేషన్ రాజ్యాంగ సవరణ బాధ్యత వహిస్తున్న జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. జస్టిస్ నాగేశ్వరరావుకు చెల్లించాల్సిన ఫీజులు, ఖర్చులు ఏఐఎఫ్ఎఫ్ భరించాలని ఆదేశించింది. రూ.25లక్షలు జస్టిస్ నాగేశ్వరరావుకు ప్రాథమికంగా డిపాజిట్ చేయాలని ఏఐఎఫ్ఎఫ్ను ధర్మాసనం ఆదేశించింది.