Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఢిల్లీకి కేసీఆర్
న్యూఢిల్లీ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం రేపు (గురువారం) ప్రారంభం కానుంది. కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు (బుధవారం) ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీలోని వసంత విహార్లో 2021 సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 12న నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్, పనుల పురోగతిని సమీక్షించారు. 1,100 చదరపు మీటర్లలో మూడు అంతస్తుల భవనం నిర్మించారు. మూడు అంతస్తుల భవనంలో 14 రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఆడియో విజువల్ థియేటర్ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తుది పనులును రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.