Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరువు నష్టం కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ
- జూన్ 3 తర్వాతే విచారణ
అహ్మదాబాద్ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్ట్ మంగళవారం నిరాకరించింది. వేసవి సెలవుల అనంతరం కోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేస్తుంది. తన పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చే వరకూ తాత్కాలిక స్టే మంజూరు చేయాలని రాహుల్ అభ్యర్థించారు. రాహుల్ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని, తాత్కాలిక లేదా తుది ఆదేశాలు జారీ చేయాలని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు. అయితే ఈ దశలో తాత్కాలిక రక్షణ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. రికార్డులు, కోర్టు ప్రొసీడింగ్స్‌ను పరిశీలించిన తర్వాతే తుది ఆదేశాలు జారీ చేస్తానని జస్టిస్ ప్రచాక్ తెలిపారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 3న కోర్టు తిరిగి ప్రారంభమైనప్పుడు పిటిషన్‌ను విచారిస్తానని చెప్పారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించగా ఆయన దానిని సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా ఆయనకు నిరాశ తప్పలేదు. దీంతో రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు.