Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌కు రాంచీ కోర్టు షాక్
రాంచీ : పరువునష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను రాంచీ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీంతో 'మోడీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌కు మరోసారి చుక్కెదురు అయినట్లయింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో జరిగిన సభలో రాహుల్ ప్రసంగిస్తూ దేశంలో అత్యున్నత స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపార వేత్తలు నీరవ్ మోడీ, లలిత్ మోడీ పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే.
దీనిపై జార్ఖండ్‌కు చెందిన ప్రదీప్ మోడీ అనే వ్యక్తి రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. బీజేపీకి చెందిన సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ కూడా మరో కేసు వేశారు. దీనిపై సూరత్ కోర్టు మార్చి 23న తీర్పు ఇస్తూ రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై రాహుల్ గుజరాత్ హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు. ఇప్పుడు రాంచీ కోర్టులోనూ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.