Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివారణకు దేశాలు చర్యలు తీసుకోవాలి:డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ : కోవిడ్ -19కు కారణమయ్యే సార్స్ కోవి-2 వైరస్ ఇంకా ఉనికిలోనే ఉందని, ఇతర అంటువ్యాధుల మాదిరిగానే దీని నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విజ్ఞప్తి చేసింది. ఈ ప్రారంభంలో జారీ చేసిన 'కోవిడ్ 19 గ్లోబల్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్, రెడీనెస్ అండ్ రెస్పాన్స్ ప్లాన్ (ఎస్పిఆర్పి) 2023' ఈ విషయాన్ని తెలిపింది. ఇప్పటికీ అంతర్జాతీయంగా ఆందోళన కలిస్తున్న కోవిడ్ మహమ్మారిపై ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని అంచనా వేయడానికి డబ్ల్యూ హెచ్ఓ ఈ నివేదికను విడుదల చేస్తోంది. వచ్చే రెండేళ్లలో కోవిడ్‌ను ఎలా ఎదుర్కొవాలో ఇందులో మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కోవిడ్-19 పుట్టిన నాలుగో సంవత్సరం వేళ కోవిడ్‌పై నిఘా క్షీణించిందని సంస్థ ఆందో ళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కేసులు, మరణాలు అత్యల్ప స్థాయిలో ఉన్నప్ప టికీ ఇంకా అనేక మిలియన్ల మంది సార్స్-కోవి-2 భారీన పడతున్నా రని లేదా మరోసారి దీని బారీనపడుతున్నారని తెలిపింది. వ్యాప్తిని తగ్గిం చడంపై ప్రత్యేక దృష్టిని సారించాలని, దీని కోసం కోవిడ్‌ను నిర్థారణ చేయడం, చికిత్స చేయడం వేగంగా చేయాలని ప్రభుత్వాలకు డబ్ల్యూహెచ్ఓ సూచించింది.