Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చనిపోయిన వారి తరఫు కుటుంబ సభ్యులు చట్టబద్ధ వారసులే
- సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్లికేషన్
- ఈనెల 9న కేసు విచారణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజధాని అమరావతి కేసులో చనిపోయిన ప్రతివాదులు తరపు కుటుంబ సభ్యులను చట్టబద్ధ వారసులుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు (ఐఏ) దాఖలు చేసింది. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై ఈ నెల 9న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. రాజధాని అమరావతి పిటిషన్ల విచారణను గత విచారణ సమయంలో సుప్రీంకోర్టు జులై 11న వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఇద్దరు మృతి చెందారని, వారి తరపున చట్టబద్ధ వారసుల ను (లీగల్ హెయిర్స్) రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని గత విచారణ సందర్భంగా ప్రతివాదుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయం తమకు తెలియదని, ప్రతివాదులు చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ పిటిషన్ దాఖలు చేస్తుందన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి అన్నారు. చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు (ఐఏ) దాఖలు చేసింది. 9న సుప్రీంకోర్టు ఐఏపైనే విచారణ చేపట్టనుంది.