Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సూడాన్‌లో చిక్కుకున్న కర్ణాటకకు చెందిన హక్కి పిక్కి గిరిజనుల తరలింపును భారత ప్రభుత్వం పూర్తి చేసింది. కేంద్రం ప్రసుత్తం చేపడుతున్న ఆపరేషన్ కావేరీలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తు న్నారు. సుడాన్ పశ్చిమ తీరంలోని డార్ఫర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వీరి తరలింపు పూర్తయిందని, సమారు నాలుగు రోజుల పాటు వీరి ప్రయాణం బస్సుల్లో సాగిందని సుడాన్ రాజధాని ఖర్టూమ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 71 మంది హక్కి పిక్కి సభ్యులు ఉన్న రెండు బస్సుల్లో ఈ తరలింపు జరిగిందని తెలిపారు. సౌదీ అరేబియా నుంచి భారత్‌కు బయలుదేరే ముందు వీరంతా జెడ్డాలో ఒక రాత్రి బస చేస్తారని తెలిపారు. కాగా, అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో చిక్కుకున్న హక్కి పిక్కి గిరిజనులు గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.