Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెరో నాలుగు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఫుడ్ స్ట్రీట్లను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దేశవ్యాప్తంగా వంద స్ట్రీట్లను అభివృద్ధి చేసేందుకు ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్‌ను గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ సహకారంతో సంయుక్తంగా అమలు చేయడానికి భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మార్గదర్శకాల ప్రకారం ఒక్కొ ఫుడ్ స్ట్రీట్‌కు రూ. 1 కోటి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఏ) కింద 60్ణ40, 90్ణ40 నిష్పత్తిలో నిధులు విడుదల అవుతాయని పేర్కొన్నారు. ఆహార వ్యాపారాలు, కమ్యూనిటీ సభ్యుల మధ్య సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అన్నారు. సురక్షితమైన తాగునీరు, చేతులు కడుక్కోవడం, మరుగుదొడ్ల సౌక ర్యాలు, సాధారణ ప్రాంతాలలో టైల్డ్ ఫ్లోరింగ్, తగిన ద్రవ, ఘన వ్యర్థాల తొల గింపు, డస్ట్బిన్ల ఏర్పాటు, బిల్‌బోర్డ్‌లను ఉపయోగించడం వంటి కార్య కలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. సాంకేతిక సహాయంలో ఫుడ్ స్ట్రీట్ రూపకల్పన చేస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఫుడ్ స్ట్రీట్లను నెలకొల్పనున్నట్టు వివరించారు.