Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : కేరళలో మత సామరస్యం, మానవత్వం కోసం పిలుపునిస్తూ వీడియోను షేర్ చేసిన తర్వాత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌పై సంఫ్‌ు పరివార్ సైబర్ దాడి చేసింది. కుల, మతాలకు అతీతంగా మలయాళీలు సహకరిస్తారని నిరూపించిన అలప్పుజాలో అంజు, శరత్‌ల పెళ్లిని ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు రెహమాన్. ది కేరళ స్టోరీ సినిమా ద్వారా లౌకికవాదానికి వ్యతిరేకంగా సంఫ్‌ు పరివార్ ప్రచారం చేస్తున్న సమయంలోనే రెహమాన్ స్పందించడం విశేషం. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఆర్ఎస్ఎస్ విద్వేష ప్రచార చిత్రం ది కేరళ స్టోరీ విడుదల అంశం చర్చనీయాంశమైనప్పుడు రెహమాన్ స్పందన వచ్చింది. రెహమాన్ షేర్ చేసిన వీడియోలో వందలాది మంది కేరళను అభినందిస్తూ కామెంట్ చేశారు. ఇది అసలు కేరళ కథ అని చాలా మంది స్పందించారు.