Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : 'ది కేరళ స్టోరీ' సినిమాపై దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా పరిశీలించాలని కేరళ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా పరిశీలించాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేరళ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లను ఆదేశించింది. శుక్రవారం సినిమా విడుదలవుతున్నందున, ఈ పిటిషన్లపై అత్యవసర నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ వాదిస్తూ, సినిమా వెనుక నిరాధారమైన వాస్తవాలను నిజమంటూ ప్రచారం చేసే ఎత్తుగడ ఉందన్నారు.