Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డిఎంకె నాయకురాలు కనిమొళి కరుణానిధి 2019లో తూత్తుకుడి ఎంపిగా ఎన్నిక కావడాన్ని సుప్రీంకోర్టు సమర్థిం చింది. ఆమె ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నామినేషన్ సమయంలో కనిమొళి తన జీవిత భాగస్వామి పాన్ నంబర్ వెల్లడించలేనందున అనర్హురాలిగా ప్రకటించా లంటూ తమిళనాడు హైకోర్టులో ఎ.సంతన్కుమార్ పిటీషన్ దాఖలు చేయగా, హైకోర్టు విచారణకు స్వీకరించింది. తన జీవిత భాగస్వామికి పాన్ నంబర్ లేకపోవడం వల్లే వెల్లడించలేదని సుప్రీం దృష్టికి కనిమొళి తీసుకొచ్చారు. ఆమె అభ్యర్థన మేరకు విచారించిన జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ను కొట్టివేసింది. హైకోర్టు విచారణపై స్టే విధించింది.