Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశరాజకీయాల్లో కీలక నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేతగా ఉన్న శరద్ పవార్ ఆ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన వారసుడి ఎంపిక జరగనున్నట్లు తెలిసింది. ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రెండు రోజుల క్రితం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్‌గా రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడు ఎవరన్న దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. ముంబైలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో ఆయన వారసుడు ఎవరనేదానిపై స్పష్టత రావచ్చని తెలుస్తోంది.
శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయంపై పునరాలోచించుకోకపోతే ఆయన కుమార్తె సుప్రియా సూలే పార్టీ అధినేత్రి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. yన్సిపిలో శరద్ పవార్ తర్వాత కీలక నేతగా ఉన్న అజిత్ పవార్‌కు కూడా అవకాశాలు ఉన్నట్లు సమాచారం.