Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సహకారం పెంపు, జాతీయ కరెన్సీల్లో చెల్లింపులే ప్రధాన ఎజెండా
బెనాలిమ్, గోవా : షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశం శుక్రవారం బెనాలిమ్‌లో ప్రారంభం కానుంది. పరస్పర వాణిజ్యం కోసం జాతీయ కరెన్సీల్లో చెల్లింపులతో సహా ఆర్థిక సహకా రాన్ని పెంపొందించడం ప్రధానంగా ఈ సమావేశం ఎజెండాలో వుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించడంతో సెంట్రల్ ఆసి యన్ సభ్యుల నుండి ఈ ప్రతిపాదన వచ్చిందని సంబం ధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటికే ఎస్సిఓ సభ్య దేశా లైన రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల మధ్య ఈ అంశంపై ప్రాథమిక చర్చలు ప్రారంభమ య్యాయని తెలుస్తోంది. జాతీయ కరెన్సీలను ఉపయోగించే చెల్లింపులు జరపడంపై భారత్ ఇప్పటికే రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. అమెరికా, యురోపియన్ యూనియన్లు ఏకపక్షంగా విధించిన ఆంక్షలను తప్పించుకోవడానికి గల ఇతర మార్గాలపై కూడా చర్చిస్తోంది. బ్రిక్స్ గ్రూపులో భాగంగా బహుళపక్ష చెల్లింపుల యంత్రాంగంపై కూడా చర్చిస్తున్నారు. సాధారణంగా భద్రత, తీవ్ర వాదం అంశాలు ఎస్సిఓ ఎజెండాలో ప్రధా నంగా వుంటాయి. కానీ భారత్ అధ్యక్షురాలిగా వ్యవహరించే ప్రస్తుత సమయంలో సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సహకారం వంటి అంశాలను కూడా చర్చకు తీసుకువస్తోందని అధికార వర్గా లు తెలిపాయి. స్టార్టప్‌లు,వినూత్న అన్వేషణలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఇతర అంశాలు కూడా ఎజెండాలో వుంటాయని సూచనప్రాయంగా తెలిపారు. విదేశాంగ మంత్రి జై శంకర్, ఎస్సిఓ సెక్రటరీ జనరల్ ఝాంగ్ మింగ్ గురువారం ఉదయం ఈ అంశాలన్నింటినీ చర్చించారు. శుక్రవారం ఉదయం ఎస్సిఓ సమావేశానం తరం విదేశాంగ మంత్రులు చర్చించి, ఆమోదించే 15 నిర్ణయాంశాలను కూడా వారు సమీక్షించారు. అవగాహనా ఒప్పందాలపై కూడా సంతకాలు జరగనున్నాయి. ఈ ఏడాదిజులైలో ఎస్ సిఓ దేశాధినేతల సదస్సులో జాతీయ కరెన్సీలో చెల్లింపులతో సహా అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు.