Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జర్మనీ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, రాజ కీయ సిద్ధాంతవేత్త, సామాజిక వేత్త, విప్లవ సోషలిస్ట్ అయిన కార్ల్ మార్క్స్ జయంత్యుత్సవాల ను శుక్రవారం జరుపుకుంటున్నా రు. ఆయన జర్మనీలోని ట్రయర్ లో 1818 మే 5వ తేదీన జన్మిం చారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ కేపిటల్ వంటి గ్రంథాలను రచిం చారు. ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్, కమ్యూనిస్ట్ ఉద్యమాలను బలోపేతం చేయడంలో ఆయన ప్రభావం అధికంగా ఉంది. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మహోన్నతుడు ఆయన. ఆయన సిద్ధాంతాలను నేటికీ పలువురు అధ్యయనం చేస్తున్నారు. మార్క్స్ 1883లో లండన్లో కన్నుమూశారు. జీవించింది సుమారు 64 సంవత్సరాలే అయినా ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఆయన రాసిన దాస్ కేపిటల్ లోకానికే దిక్సూచి.