Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహారం ధర పైపైకి...
న్యూఢిల్లీ : దేశంలో ఆహారం ధర పెరిగింది. గోధుమలు, చికెన్, వంటగ్యాస్, వంటనూనెల ధరల పెరుగుదల ప్రభావం ఆహారం పైన పడింది. గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో శాఖాహార భోజనం ధర 9 శాతం, మాంసాహార భోజనం ధర 32 శాతం పెరిగిందని క్రిసిల్ నెలవారీ భోజన ప్లేటు ధర సూచిక తెలిపింది. బ్రాయిలర్ కోడి మాంసం ధర యాభై శాతానికి పైగా పెరగడంతో మాంసాహార భోజన ధరలో పెరుగుదల అధికంగా ఉంది. ఉత్పత్తి తగ్గడం తో గోధుమల ధరలు కూడా 15 శాతం మేర పెరిగాయి. వంటనూనెల ధరలు 6 శాతం, వంటగ్యాస్ ధర 20 శాతం మేర పెరిగాయి.
అయితే ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ నెలల మధ్యకాలంలో ధరలు కొంతమేర దిగివచ్చాయి. ఏప్రిల్లో వంటనూనెలు, బ్రాయిలర్ చికెన్ ధరలు కొంత తగ్గాయి. అయితే గోధుమలు, వంటగ్యాస్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆహారం ధరలలో పెద్దగా మార్పు రాలేదు.