Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం
- సమ్మర్‌హిల్‌లో సీపీఐ(ఎం) గెలుపు
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది. కార్పొరేషన్లో మొత్తం 34 వార్డులు ఉండగా కాంగ్రెస్‌కు 24 వార్డులు లభించాయి. ఇప్పటివర కూ బీజేపీ చేతిలో ఉన్న ఈ కార్పొరేషన్నుకాంగ్రెస్ చేజిక్కించుకుంది. బీజేపీకి కేవలం 9 వార్డులు మాత్రమే దక్కాయి. సీపీఐ(ఎం)కు ఒక వార్డు రాగా అమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. సమ్మర్‌హిల్ (ఐదవ వార్డు)లో సీపీఐ(ఎం) అభ్యర్థి వీరేంద్ర ఠాకూర్ 78ఓట్ల మెజారిటీతో గెలుపొం దారు. గత ఎన్నికలలో కూడా సీపీఐ(ఎం) ఇదే స్థానంలో విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని వార్డులకూ పోటీ చేశాయి. సీపీఐ(ఎం) నాలుగు చోట్ల అభ్యర్థులను నిలిపింది. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ 17 వార్డులు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్‌కు 12, సీపీఐ(ఎం)కు ఒక్క వార్డు రాగా నలుగురు స్వతంత్రులు గెలుపొందారు.