Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : బీహార్‌లో కుల గణనపై పాట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. నిజానికి కుల గణన చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నితీష్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరారు. కేంద్రం నుంచి సరైన సమాధానం లేకపోవడంతో నితీష్ ప్రభుత్వమే స్వయంగా తమ రాష్ట్రంలో కులగణనకు పూనుకుంది. ఈ గణనకు బిజెపి మినహా బీహార్‌లోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. దీంతో జనవరి 7న అధికారికంగా కుల గణన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కులాల వారీగా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిని తెలుసుకునే సర్వేలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ బిజెపి ఆరోపణలు చేసింది. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ సర్వే మెరుగైన లబ్ధిని అందిస్తుందని, ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని సిఎం నితీష్‌కుమార్ అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. ఒబిసి వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఒబిసిల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బీహార్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఆరంభించిన ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతోంది. ఇప్పటికే ఒక సర్వే పూర్తయింది. మొదటి విడతలో జనవరి 7 నుంచి 21 తేదీ వరకు సర్వే జరిగింది. ఇక రెండవ విడత సర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నిర్వహించాలి. కొన్ని అభ్యంతరాలు, అడ్డంకుల నడుమ సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది.