Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 67 మంది గుజరాత్ జ్యుడిషియల్ అధికారులకూ..
- దీనిపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
- 8న విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) హరీష్ హస్ముఖ్భారు వర్మ సహా 68 మంది గుజరాత్ దిగువ జ్యుడీషియల్ అధికారులకు పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 8న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ''మెరిట్-కమ్-సీనియారిటీ సూత్రాన్ని'' విస్మరించినట్టు ఆ పిటిషన్లో పేర్కొనబడింది.
గుజరాత్లో 68 మంది జ్యుడీషియల్ అధికారులను జిల్లా జడ్జిల ఉన్నత స్థాయికి ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ అధికారులు రవికుమార్ మహేతా, సచిన్ ప్రతాప్రారు మెహతా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి న్యాయమూర్తులు ఎంఆర్ షా, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం మే1న నిర్ణయించింది.
సూరత్ సీజేఎం అయిన వర్మ, జిల్లా దిగువ న్యాయవ్యవస్థలోని 68 మంది అధికారులలో ఒకరు. వీరి పదోన్నతిని కూడా మహేతా, మెహతా సవాలు చేశారు. వీరు ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వం యొక్క న్యాయ విభాగంలో అండర్ సెక్రటరీగా, రాష్ట్ర న్యాయ సేవ అథారిటీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు జ్యుడీషియల్ అధికారుల పిటిషన్‌పై ఏప్రిల్ 13న రాష్ట్ర ప్రభుత్వానికి, గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం, కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసినా అధికారులు 68 మందికి పదోన్నతి కల్పిస్తూ ఏప్రిల్ 18న జారీ చేసిన నిర్ణయాన్ని ఏప్రిల్ 28న తన ఉత్తర్వుల్లో తీవ్రంగా విమర్శించింది. ప్రమోషన్ ఆర్డర్లో, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్ల ఫలితాలకు లోబడి ఉంటుందని పేర్కొంది.
సీనియారిటీ-కమ్-మెరిట్ లేదా మెరిట్-కమ్-సీనియారిటీ, స్థానం ఆధారంగా ప్రశ్నార్థకమైన పోస్టుకు పదోన్నతులు ఇవ్వాలా అనే దానిపై ప్రత్యేకంగా సమాధానం దాఖలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను అత్యున్నత న్యాయస్థానం కోరింది. దీనికి ముందు, ఇద్దరు జ్యుడిషియల్ అధికారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏప్రిల్ 13న నోటీసులు జారీ చేసింది.
రిక్రూట్మెంట్ నిబంధనల ప్రకారం, మెరిట్-కమ్-సీనియారిటీ సూత్రం ఆధారంగా 65 శాతం రిజర్వేషన్లు ఉంచి, అనుకూలత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారితో జిల్లా జడ్జి పోస్టులను భర్తీ చేయాలని పిటిషన్లో పేర్కొనబడింది. అయితే, ఈ పిటిషన్ విచారణకు రానుండటంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.