Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : పెద్ద ఎత్తున హింస, జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో వుందని, అక్కడ తక్షణమే శాంతిని, సాధారణ పరిస్థితులను పునరుద్దరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇండ్లను ధ్వంసం చేశారు, తగలబెట్టారు, చర్చిలు, ఆలయాలతో సహా ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ ఘర్షణల్లో అనేకమంది మరణించారు. సైన్యాన్ని, కేంద్ర పోలీసు బలగాలను రంగంలోకి దింపడంతో పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వచ్చాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. అయితే ఇంకా చెదురుమదురుగా ఘర్షణలు జరుగుతునే వున్నాయి. ఇప్పటికీ ఇంకా ఇండ్లల్లోనే ప్రజలు బందీలుగా వుండిపోతున్నారు. బయటకువచ్చే పరిస్థితులు లేవు. అల్లర్ల కారణంగా వేలాదిమంది నిర్వాసితులయ్యారు. ఈ పరిస్థితులను ముందుగానే ఊహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని పొలిట్‌బ్యూరో విమర్శించింది. శాంతి భద్రతల పరిరక్షణలో జోక్యం చేసుకోవడంలో కూడా జాప్యం జరిగిందని పేర్కొంది. అడవుల రక్షణ పేరుతో కొండ ప్రాంతాల్లోని ప్రజలను పెద్ద ఎత్తున ఖాళీ చేయించేందుకు, బయటివారిని అక్కడ నుంచి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రజల్లో భయాలను కలగచేసి, కొన్ని కొండ ప్రాంత జిల్లాల్లో విస్తతమైన నిరసనలకు దారి తీసిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇంతటి హింసాత్మక ఘర్షణలకు దారి తీసిన అంశాలను పరిష్కరించడానికి ముందుగా, రాష్ట్రంలో శాంతిని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరిం చడమే తక్షణమే కర్తవ్యమని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది. కేంద్రం సాయంతో, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులైన వారందరికీ తిరిగి వారి స్థలాల్లో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలనికోరింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమా వేశాన్ని ఏర్పాటు చేయాలని, అప్పుడే పరిస్థితులను ఎదుర్కొనడానికి ఐక్య ప్రయత్నాలు, కృషి జరుగుతాయని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది.