Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు నదిలో పడి 22 మంది మృతి
రాయ్‌పూర్ : మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లాలో ఒక వంతెనపై నుంచి నీళ్లు లేని నదిలో ఒక బస్సు పడిపోవడంతో 22 మంది మరణిం చారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ఇండోర్ నుంచి ఖర్గోన్ పట్టణం సమీపంలోని శ్రీఖంది గ్రామానికి వెళుతుండగా, డోంగర్గాన్ గ్రామం వద్ద ఉదయం 8:40 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో బస్సులో 50 మందికిపై ప్రయాణీకులు ఉన్నారు. ముందుగా వంతెన రెయిలింగ్‌ను ఢకొీట్టి బస్సు తరువాత నదిలో పడిపోయింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఖర్గోన్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుల్లో బస్సు డ్రైవర్, క్లీనర్‌గా ఉన్నారు. బస్సు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందినదని, పరిమితికి మించిన ప్రయాణీకుల సంఖ్య కారణంగానే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన
మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పీఎంఓ
ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల పరిహారాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో మరణించిన ప్రతీ వ్యక్తీ కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ 2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించింది.