Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'యాన్ ఇన్సిగ్నిఫికంట్ మ్యాన్'పై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: సిని నిర్మాతలు, రచయితల వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోలేమని భారత సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ప్రజాస్వామ్య దేశంలో ఈ రెండూ అత్యున్నతమైనవని అభిప్రాయపడింది. ఈ మేరకు 'యాన్ ఇన్సిగ్నిఫికంట్ మ్యాన్' అనే సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎఎం కాన్విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నిరాకరించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా శుక్రవారం(నేడు) విడుదల కానున్నది. కాగా..కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నందున సినిమా విడుదలపై స్టే విధించాలంటూ వల్హాకర్ అనే వ్యక్తి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వల్హాకర్.. 2013లో కేజ్రీవాల్‌పై సిరా దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి.