Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: సర్వే ఇన్స్పెక్టర్ గేదెల లక్ష్మీగణేశ్వరరావు అవినీతి చిట్టా తవ్విన కొద్దీ బయటకొస్తోంది. నిందితునితో పాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, లాకర్లపై ఆదివారం ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడుల సందర్భంగా అధికారులకు దొరికిన బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. స్టేట్ బ్యాంకుతో పాటు కొన్ని జాతీయ, ప్రైయివేటు బ్యాంకుల్లోనూ గణేశ్వరరావు కుటుంబీకులకు ఖాతాలున్నట్లు గుర్తించారు. వీటితో పాటు కొన్ని లాకర్ల సమాచారం కూడా అధికారులకు దొరికినట్లు సమాచారం. సోమవారం, మంగళ వారాల్లో లాకర్లను తెరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లాకర్లలో మరింత అక్రమా స్తుల సమాచారం ఉండే అవకాశముందని ఎసిబి అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం అర్థరాత్రి వరకూ విశాఖపట్నంలోని నింది తుని స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సంద ర్భంగా సెల్లార్‌లోని కారును తనిఖీ చేశారు. కారు వెనుక అద్దాలు పగిలి ఉండ టంతో పాటు కొన్ని రక్తపు మరకలు ఆ ప్రాంతంలో కనబడటంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యులపై ప్రత్యేక దృష్టి సారించారు.