Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత వైమానిక దళంలో సంక్లిష్ట అవసరాలు నెరవేరేందుకు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ యుద్ధ క్షిపణిని, సుఖోరు యుద్ధ విమానంతో ఏకీకృతం చేసే పనులు ప్రారంభమయ్యాయని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమై న సూపర్ సోనిక్ యుద్ధ క్షిపణనిని నవంబరు 22న సుఖోరు-30 యుద్ధ జెట్ విమానం నుండి విజయవంతంగా పరీక్షించారు. దేశ వైమా నిక దళానికి సంబంధించి ఖచ్చితమైన దాడుల సామర్థ్యాన్ని పెంపొం దించుకోవడంలో ఈ పరీక్ష ప్రధాన మైలురాయిగా నిలిచింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ను సుఖోరు యుద్ధ విమానంతో ఏకీకృతం చేసే పనులు 2020 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.