Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలాసోర్: సూపర్సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణిని సోమవారం విజయవం తంగా ప్రయోగించారు. ఒడిషాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి డీఆర్డీఓ ఆధ్వర్య ంలో ఉదయం 10.18 గంటలకు దీనిని పరీక్షించారు. ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని క్షిపణి విజయవం తంగా పూర్తి చేసిందని డీఆర్డీఓ వర్గాలు వెల్లడించాయి. క్షిపణి జీవితకాలాన్ని 10 నుంచి 15 ఏండ్లు పెంచడంలో భాగంగా దీనిని ప్రయోగించారు. జీవిత కాలాన్ని 15 ఏండ్లకు పెంచడంలో బ్రహ్మోస్ క్షిపణి మొదటిదని డీఆర్డీఓ అధికారి ఒకరు తెలిపారు. ఇదే బ్రహ్మోస్ క్షిపణిని ఈ ఏడాది మే21న విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే వేగవంతమైన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి.. ధ్వని కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణించగలదు. బ్రహ్మోస్ ఫ్లైట్ రేంజ్ 290 కిలోమీటర్లకు పైగానే ఉంది. ఇది 200 నుంచి 300 కిలోల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటికే భారత ఆర్మీ, నేవీలో సేవలు అందిస్తున్న బ్రహ్మోస్.. భారత వైమానిక దళ యుద్ద విమానం సుఖోరు 30 ఎంకేఐలోనూ భాగం కానుంది. డీఆర్డీఓ, రష్యాకు చెందిన ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా దీనిని రూపొందించాయి.