Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టించిన చండీగఢ్ యువతి
చండీగఢ్ : వాల్ చరిత్ర సృష్టించారు. కర్నాటకలోని ఎల్హంక ఏయిర్ ఫోర్స్ స్టేషన్లో కోర్సును పూర్తి చేసుకున్న అనంతరం ఆమె ఈ పదవికి ఎంపికై ఈ ఘనత సాధించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆరు నెలల కోర్సులో భాగంగా ఆమె ఎన్నో కష్టాలను చవి చూసారు. అయినప్పటికీ ఆమె ఎంతో పట్టుదలతో కోర్సును పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తొలి ఫ్లైట్ ఇంజినీర్‌గా సెలెక్ట్ అవ్వడంతో తన చిరకాల వాంఛ సాకారమైందని ఆమె తెలిపారు. తన బాల్యం నుంచే సైనిక దుస్తులను ధరించే దానినని, ఆ సమయంలోనే ఏవియటర్గా పని చేయాలని ఆసక్తి ఉండేదని తెలిపారు. కాగా ఇండియన్ ఏయిర్ ఫోర్స్‌కు చెందిన వివిధ హెలికాప్టర్ ఆపరేషనల్ విభాగాల్లో ఫ్లైట్ ఇంజనీర్ హోదాలో ఆమె పని చేయనున్నారు. వాయుసేన అవసరాల మేరకు సియాచిన్ గ్లేషియర్ నుంచి వివిధ ప్రాంతాల్లో ఒత్తిళ్లతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది.